క్రీడా రంగానికి ప్రభుత్వం పెద్దపీట
NEWS Aug 29,2026 11:34 pm
క్రీడాకారులకు అంతర్జాతీయ స్థాయి మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి అన్నారు. హనుమకొండలోని జేఎన్ఎస్ ఇండోర్ స్టేడియంలో బ్యాడ్మింటన్ కోర్టును ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, ఎంపీ కడియం కావ్యతో కలిసి ప్రారంభించారు. విద్యా, వైద్యంతో పాటు క్రీడా రంగానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత నిస్తోందని క్రీడా మౌలిక వసతులను మరింత అభివృద్ధి చేసి ఈ ప్రాంతాన్ని ప్రధాన క్రీడా కేంద్రంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.