ప్రభుత్వ స్థలాలను కాపాడాలి: ప్రవీణ్ రావు
NEWS Aug 29,2026 11:29 pm
కరీంనగర్: అధికారుల నిర్లక్ష్యం వల్ల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ప్రభుత్వ స్థలాలు అన్యాక్రాంతమవుతున్నాయని కార్పొరేటర్ బోయినిపల్లి ప్రవీణ్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. పాలకవర్గ సమావేశంలో ఆయన మాట్లాడుతూ... తన డివిజన్‌లోని వివేకానంద విగ్రహ స్థలం వివాదంపై కోర్టుకు వెళ్లాల్సి వచ్చిందన్నారు. అధికారులు తక్షణమే స్పందించి సరైన పత్రాలతో సర్కార్ స్థలాలను స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేశారు.