అంగన్‌వాడీలకు ఉచిత విద్యుత్ వెలుగులు
NEWS Aug 29,2026 11:28 pm
కరీంనగర్ : జిల్లాలోని 379 అంగన్‌వాడీ కేంద్రాలకు ఎన్పీడీసీఎల్ ద్వారా ఉచిత విద్యుత్ కనెక్షన్లు అందించినట్లు కరీంనగర్ సర్కిల్ ఎస్‌ఈ ఆర్.రవీందర్ తెలిపారు. విద్యుత్ సౌకర్యంతో చిన్నారులకు వేడి ఇబ్బందులు తప్పి, హాయిగా చదువుకునే వాతావరణం ఏర్పడిందన్నారు. ఫ్యాన్లు, లైట్లు, నీటి మోటార్లు అందుబాటులోకి రావడంతో పోషకాహార తయారీ, పరిశుభ్రత నిర్వహణ అంగన్‌వాడీ కార్యకర్తలకు సులువవుతుందన్నారు. చిన్నారుల సంక్షేమమే ధ్యేయంగా ఈ చర్యలు చేపట్టినట్లు ఎస్‌ఈ పేర్కొన్నారు.