కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ సమావేశం
NEWS Aug 29,2026 02:11 pm
కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ సర్వసభ్య సమావేశం మేయర్ కొలగాని శ్రీనివాస్ అధ్యక్షతన ప్రారంభమైంది. నగర అభివృద్ధి, పెండింగ్ పనుల పూర్తి, వినాయక చవితి ఏర్పాట్లు, డంపింగ్ యార్డ్ తరలింపుపై ప్రధానంగా చర్చించనున్నారు. మరోవైపు ఓట్ల తొలగింపు, అభివృద్ధి పనుల్లో నిర్లక్ష్యంపై పాలకవర్గాన్ని నిలదీసేందుకు ప్రతిపక్ష కార్పొరేటర్లు సిద్ధమవడంతో సమావేశంలో ఉత్కంఠ నెలకొంది.