కార్యకర్తలకు అండగా ఉంటాం: కడియం
NEWS Aug 29,2026 02:15 pm
జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం ఎల్లారెడ్డిగూడెం గ్రామానికి చెందిన పలువురు కార్యకర్తలు ఎమ్మెల్యే కడియం శ్రీహరి సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కడియం వారికి కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. కార్యకర్తలకు పార్టీ ఎల్లప్పుడు అండగా ఉంటుందని ప్రతి ఒక్కరు పార్టీ బలోపేతాని కృషి చేయాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమానికి పెద్దపీట వేస్తోందన్నారు.