పోలీస్ ఉద్యోగాలకు ఉచిత శిక్షణ
NEWS Aug 29,2026 02:15 pm
కరీంనగర్: పోలీస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా మైనారిటీ అభ్యర్థుల కోసం ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు జమాతే ఇస్లామీ హింద్ నగర అధ్యక్షుడు సోహెబ్ అహ్మద్ ఖాన్ తెలిపారు. అకాడమీ ఆఫ్ సక్సెస్ అండ్ అచీవ్‌మెంట్ భాగస్వామ్యంతో ఎస్‌ఐ, కానిస్టేబుల్ పోస్టులకు రెసిడెన్షియల్ కోచింగ్ అందిస్తున్నారు. పోలీస్ శాఖలో ముస్లింల ప్రాతినిధ్యాన్ని పెంచడమే లక్ష్యంగా చేపట్టిన ఈ అవకాశాన్ని అర్హులైన యువతీ యువకులు వినియోగించుకోవాలని సంస్థ ప్రతినిధులు కోరారు.