ITIలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
NEWS Aug 29,2026 02:13 pm
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని ప్రభుత్వ ఐటీఐ, ఏటీసీలలో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి మూడో విడత అడ్మిషన్ల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రభుత్వ ఐటీఐ ప్రిన్సిపాల్ జుమ్లా నాయక్ తెలిపారు. సెప్టెంబర్ 5వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. ప్రవేశం పొందాలనుకునే విద్యార్థులు సంబంధిత ధ్రువీకరణ పత్రాలతో నేరుగా ప్రభుత్వ ఐటీఐలో హాజరైతే తక్షణమే అడ్మిషన్ కల్పిస్తామని తెలిపారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని జుమ్లా నాయక్ సూచించారు.