ఫీజు బకాయిలకై ‘బీజేపీ లడాయి’ ఉద్రిక్తం
NEWS Aug 29,2026 02:12 pm
కరీంనగర్: ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్ తెలంగాణ చౌక్‌లో బీజేపీ చేపట్టిన ‘ఫీజు బకాయి - బీజేపీ లడాయి’ నిరసన ఉద్రిక్తంగా మారింది. పోలీసుల అడ్డంకులను ధిక్కరించి శ్రేణులు ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడితే సహించేది లేదని, బకాయిలు ఇచ్చే వరకు పోరాటం కొనసాగిస్తామని బీజేపీ నాయకులు హెచ్చరించారు.