తెలంగాణలో ఆందోళనకరంగా క్రైమ్ రేట్
NEWS Aug 28,2026 09:44 pm
తెలంగాణలో గత మూడేళ్లతో పోలిస్తే మొత్తం నేరాల సంఖ్య 7.15% మేర పెరిగింది. మాదకద్రవ్యాలు (నార్కోటిక్స్) సంబంధిత కేసులు 46% పెరగడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. అర్ధవార్షిక నేర సమీక్షా సమావేశంలో DGP సీవీ ఆనంద్ ఈ గణాంకాలను తెలిపారు. పోలీసు శాఖ విడుదల చేసిన వివరాల ప్రకారం, 2023-24లో 2,65,377గా నమోదైన మొత్తం కేసుల సంఖ్య, 2025-26 నాటికి 2,84,363కు చేరింది. ఇదే సమయంలో నార్కోటిక్స్ కేసులు 2,026 నుంచి 2,960కు పెరిగాయి. ఇక వ్యవస్థీకృత నేరాలు (ఆర్గనైజ్డ్ క్రైమ్) ఏకంగా 1,704% పెరుగుదలతో 25 నుంచి 451కి చేరింది.