నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవు
NEWS Aug 28,2026 08:23 pm
హనుమకొండలోని స్కానింగ్,డయాగ్నొస్టిక్ సెంటర్లను జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి ఆకస్మికంగా తనిఖీ చేశారు.
డయాగ్నస్టిక్ సెంటర్ లో స్కానింగ్ ల వివరాలను స్కానింగ్ కేంద్రం ప్రతినిధులను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ఈ స్కానింగ్ కేంద్రంలో వివిధ రకాల స్కానింగ్ పరీక్షలకు సంబంధించిన ధరల వివరాలను తెలిపే పట్టిక కింద పెట్టి ఉండటంతో స్కానింగ్ కేంద్రం ప్రతినిధులను కలెక్టర్ ప్రశ్నించారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డిఎంహెచ్ అప్పయ్య తదితరులు పాల్గొన్నారు.