భారత్‌లో నం. 1 సెలబ్రిటీ కోహ్లీ
NEWS Aug 28,2026 06:52 pm
భారత్‌లో అత్యంత విలువైన సెలబ్రెటీ లిస్టులో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ నంబర్ వన్ స్థానాన్ని దక్కించుకున్నాడు. కోహ్లీ బ్రాండ్ విలువ రూ.3, 542 కోట్లుగా నమోదైంది. బాలీవుడ్ స్టార్స్ షారుఖ్ ఖాన్, రణ్‌వీర్ సింగ్ కంటే కోహ్లీ టాప్ ప్లేస్ సాధించాడు. ఈ లిస్టులో షారుఖ్ 2వ స్థానం, గ్లోబల్ స్టార్ ప్రియాంకా చోప్రా జోనాస్ 3వ స్థానాన్ని దక్కించుకున్నారు.