రాఖీ బంధం ప్రేమానురాగాల ప్రతీక
NEWS Aug 28,2026 06:57 pm
కరీంనగర్: అన్నాచెల్లెళ్ల ప్రేమానురాగాలకు, ఆత్మీయతకు రక్షాబంధన్ పండుగ సజీవ ప్రతీక అని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, కరీంనగర్ డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు తెలిపారు. పండుగ సందర్భంగా ఆయన క్యాంప్ కార్యాలయంలో రాఖీ వేడుకలు ఘనంగా జరిగాయి. కార్పొరేటర్లు సుదగోని మాధవి, గుగ్గిళ్ల జయశ్రీ, బ్రహ్మకుమారీస్ సోదరీమణులు సునీల్ రావుకు రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపారు. అభిమానంతో రాఖీలు కట్టిన సోదరీమణులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.