అర్హులు పెన్షన్లకు దరఖాస్తు చేసుకోవాలి
NEWS Aug 28,2026 06:59 pm
అరులైన ప్రతి ఒక్కరూ చేయూత సామాజిక భద్రత పింఛన్ల దరఖాస్తు చేసుకోవాలని జనగామ కలెక్టర్ సందీప్ కుమార్ జా సూచించారు. జనగామలోని సమకృత జిల్లా కార్యాలయ భవనం సముదాయంలో చేయూత సామాజిక భద్రత పింఛన్ల పోస్టర్ ఆవిష్కరించిన కలెక్టర్.. సమాజంలోని అర్హులైన వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, రక్తసంబంధిత వ్యాధులతో బాధపడుతున్న దివ్యాంగులు, గీతాకార్మికులు, చేనేత కార్మికులకు ప్రభుత్వం అందించే పెన్షన్ ద్వారా సామాజిక భద్రత కల్పిస్తుందని తెలిపారు. https://cheyutha.telangana.gov.in వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు.