సోదర బంధానికి ప్రతీక రాఖీ: మంత్రి పొన్నం
NEWS Aug 27,2026 08:15 pm
రాఖీ పౌర్ణమి సందర్భంగా రాష్ట్ర ప్రజలకు రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ శుభాకాంక్షలు తెలిపారు. అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీకగా నిలిచే ఈ పండుగ ప్రతి ఇంటా ఆనందాలు నింపాలన్నారు. తెలంగాణ ఆడబిడ్డల సంక్షేమం, భద్రత, సాధికారతకు ప్రజా ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని, మహిళల అభివృద్ధికి అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు.