నగర సుందరీకరణకు కృషి చేయాలి
NEWS Aug 27,2026 08:15 pm
వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పచ్చదనం పెంపు, పార్కుల అభివృద్ధి,సుందరీకరణకు ప్రాధాన్యం ఇవ్వాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ అన్నారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ నూతన ఉద్యానవన అధికారిగా నియమితులైన తిరునగిరి ప్రశాంత్ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. నగరంలో మొక్కల సంరక్షణ,పచ్చదనం పెంపుకు కృషి చేయాలని సూచించారు.