పద్మనగర్ MLS పాయింట్‌లో విజిలెన్స్ తనిఖీ
NEWS Aug 27,2026 08:16 pm
కరీంనగర్: పద్మనగర్‌లోని రేషన్ బియ్యం మండల స్థాయి నిల్వ కేంద్రం (MLS పాయింట్)ను గురువారం సివిల్ సప్లైస్ విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫీసర్ లక్ష్మారెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ధాన్యం నిల్వలు, షాపుల రవాణా రిజిస్టర్లను పరిశీలించారు. లబ్ధిదారులకు 3 నెలల బియ్యం ఒకేసారి ఇస్తుండటంతో, షాపులకు ఎమ్‌ఎల్‌ఎస్ పాయింట్ నుంచి బియ్యం సరఫరా కావడం లేదన్న ఫిర్యాదులతో ఈ విచారణ చేపట్టారు.