సీఎం తక్షణమే జీవో 97ను రద్దు చేయాలి
NEWS Aug 27,2026 06:56 pm
సీఎం రేవంత్ రెడ్డి బేషజాలకు పోకుండా తక్షణమే జీవో 97ను రద్దు చేయాలని మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు. వరంగల్ లో మాజీ మంత్రి హరీష్ రావు పర్యటించారు. ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల సందర్శనగ వెళ్తున్న హరీష్ రావును పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు. విద్యార్థులు రోడ్లపైకి ఎక్కి ధర్నాలు చేస్తున్న ప్రభుత్వంలో ఏమాత్రం చలనం లేదని ఆరోపించారు. ఇప్పటికైనా సీఎం రేవంత్ రెడ్డి స్పందించి విద్యార్థులకు న్యాయం చేయాలని కోరారు.