కన్నాపురం సర్పంచ్ సతీష్‌కు అభినందనలు
NEWS Aug 27,2026 06:49 pm
జగిత్యాల రూరల్ మండలం కన్నాపురం గ్రామ సర్పంచ్ పొట్టవత్తిని సతీష్‌ను హైదరాబాద్ రవీంద్రభారతిలో ఘనంగా అభినందించారు. బీసీ టైమ్స్, జనాధికార సంస్థల ఆధ్వర్యంలో నిర్వహించిన పద్మశాలి సర్పంచుల అభినందన సభలో కేంద్ర ప్రభుత్వ జాయింట్ సెక్రటరీ పరికిపండ్ల నరహరి ఐఏఎస్ చేతుల మీదుగా సతీష్‌కు అభినందనలు అందజేశారు.
గ్రామ ప్రజల విశ్వాసంతో ఏకగ్రీవంగా సర్పంచ్‌గా ఎన్నికై గ్రామాభివృద్ధికి కృషి చేస్తున్నందుకు సతీష్‌కు ఈ గుర్తింపు లభించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనపై నమ్మకంతో ఏకగ్రీవంగా ఎన్నుకున్న కన్నాపురం గ్రామ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.