నగునూరులో రోడ్డు పనులకు శంకుస్థాపన
NEWS Aug 27,2026 02:56 pm
కరీంనగర్ : నగునూరులో ఎస్‌జీఎఫ్ నిధులు రూ. 10 లక్షలతో చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులకు ఎమ్మెల్యే గంగుల కమలాకర్ శంకుస్థాపన చేశారు. అనంతరం మల్లికార్జున స్వామి ఆలయ భూమిపూజలో పాల్గొని రూ. లక్ష విరాళమందించారు. స్థానిక సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్న ఎమ్మెల్యే, కేసీఆర్ హయాంలోనే రాష్ట్రం సుభిక్షంగా సాగిందని, కాంగ్రెస్ ప్రభుత్వం మోసపూరిత హామీలతో ప్రజలను వంచిస్తోందని విమర్శించారు.