అల్లు అర్జున్‌కు మరో అరుదైన గౌరవం
NEWS Aug 27,2026 02:55 pm
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మరో అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. Forbes India 2026లో ప్రకటించిన ‘100 Biggest Celebrities’ ప్రత్యేక సంచిక కవర్‌పై అల్లు అర్జున్ చోటు దక్కించుకున్నారు. సినిమాలతో పాటు ఆయనకున్న బ్రాండ్ ఇమేజ్, బాక్సాఫీస్ ప్రభావం, దేశవ్యాప్తంగా పెరుగుతున్న పాపులారిటీకి ఈ గుర్తింపు నిదర్శనంగా నిలిచిందని చెబుతున్నారు. గత కొన్నేళ్లుగా అల్లు అర్జున్ స్టార్‌డమ్ కొత్త స్థాయికి చేరుకుంది. ముఖ్యంగా ‘పుష్ప 2: ది రూల్’ సాధించిన భారీ విజయంతో ఆయనకు దేశవ్యాప్తంగా క్రేజ్ మరింత పెరిగింది. భాషలు, ప్రాంతాలతో సంబంధం లేకుండా ప్రేక్షకుల్లో అల్లు అర్జున్‌కు ఏర్పడిన ఫాలోయింగ్ ఆయనను పాన్ ఇండియా స్టార్‌గా నిలబెట్టింది.