నేపాల్ వారదల్లో తెలుగు వాళ్లు గల్లంతు అయ్యారు. కైలాస మానసరోవర్, నేపాల్ విహారయాత్రకు వెళ్లిన 140 మంది తెలుగు యాత్రికులు ఆచూకీ తెలియడం లేదు. హైదరాబాద్‌లోని ఒక ప్రైవేటు ఏజెన్సీ ద్వారా మొత్తం 156 మంది తెలుగు యాత్రికులు ఈ పర్యటనకు వెళ్లగా, వారిలో 140 మంది ఆచూకీ లభించడం లేదు. పలువురు భారతీయుల జాడ కూడా తెలియడం లేదు. ఇండియన్ ఎంబసీ రంగంలోకి దిగి నేపాల్ భద్రతా దళాలతో కలిసి వరద ప్రభావిత ప్రాంతాల్లో హెలికాప్టర్ల ద్వారా విస్తృతంగా గాలింపు, సహాయక చర్యలు ముమ్మరం చేసింది.