తెలంగాణ ఉద్యమ తరహాలో పోరు తప్పదు
NEWS Aug 27,2026 02:55 pm
కరీంనగర్: పెండింగ్ సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట ఉద్యోగులు మహాధర్నా చేపట్టారు. జేఏసీ పిలుపు మేరకు టి.ఎన్.జి.ఓ జిల్లా అధ్యక్షుడు దారం శ్రీనివాసరెడ్డి, టి.జి.ఓ జిల్లా కన్వీనర్ కాళీచరణ్ నేతృత్వంలో ఈ నిరసన జరిగింది. ఆరు డీఏలు, పీఆర్సీ విడుదల చేయాలని, సీపీఎస్ రద్దు చేసి ఓపీఎస్ అమలు చేయాలని స్పష్టం చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే సకలజనుల సమ్మె రీతిలో పరిపాలనను స్తంభింపజేస్తామని హెచ్చరించారు.