కాఠ్‌మాండూ: నేపాల్‌పై జలఖడ్గం విరుచుకుపడింది. టిబెట్‌లో మొదలైన వరద నేపాల్ మధ్య ప్రాంతాన్ని తుడిచి పెట్టేసింది. గ్రామాలు, పట్టణాలు జల సమాధి అయ్యాయి. 160 మంది మృతి చెందారు. 750 మందికిపైగా గల్లంతయ్యారు. వారిలో 133 మంది భారతీయులే ఉన్నారు. ఇందులో 77 మంది ఈశా ఫౌండేషన్ యాత్రికులున్నారు. వీరంతా ఎన్నారైలు. ప్రవాస తెలుగువారూ వీరిలో ఉన్నారు. మరో 37 మంది తంజావూర్‌కు చెందిన తమిళులూ గల్లంతయ్యారు. టిబెట్‌లో 265 మంది మిస్సింగ్. ముగ్గురు మృతి. వరద దెబ్బకు నేపాల్‌లో భవనాలు, వంతెనలు కొట్టుకుపోయాయి. నేపాల్‌లో అంధకారం నెలకొంది. ప్రమాద సమాచారం తెలిసిన వెంటనే నేపాల్ ప్రధాని బాలేంద్ర షాకు ప్రధాని మోదీ ఫోన్ చేసి, అన్ని రకాల సాయం అందిస్తామని హామీ ఇచ్చారు.