బ్లాక్‌బస్టర్ మూవీ ‘అర్జున్ రెడ్డి’ మళ్లీ రిలీజ్ రానుంది. విడుదలై వచ్చే ఏడాది పదేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఎక్స్‌టెండెడ్ వెర్షన్‌ను దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ప్రకటించారు. దీనికోసం విజయ్ దేవరకొండ 2, 3 రోజులు డబ్బింగ్ చెప్పాలి. తాను 15 - 20 రోజులు దీనిపై పని చేయాల్సి ఉంటుందని సందీప్ రెడ్డి చెప్పారు. అదనపు సీన్లు, మరింత కంటెంట్‌ను జోడించే పనిలో నిమగ్నం కానున్నట్లు స్పష్టం చేయడంతో అంచనాలు భారీగా పెరిగిపోయాయి.