పోలీస్ అధికారులను అభినందించిన సీపీ
NEWS Aug 26,2026 09:55 pm
హనుమకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవల ఓ వ్యక్తి క్యాటరింగ్ కాంట్రాక్టర్ పేరుతో హాస్టల్ యజమానులను మోసం చేసి లక్షలాది రూపాయలను కాజేశాడు. ఈ కేసును హనుమకొండ పోలీసులు చాణచక్యంగా చేదించి నిందితుని పట్టుకున్నారు. నిందితుడిని పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన పోలీస్ అధికారులు సిబ్బందిని వరంగల్ పోలీస్ కమిషనర్ శ్వేత అభినందించారు. ఇందులో ఏసీపీ నరసింహ రావు, సిఐ శివకుమార్, ఏఏఓ సల్మాన్ పాషా, కానిస్టేబుల్ కిరణ్ కుమార్ తదితరులు ఉన్నారు.