ప్రశాంతంగా మిలాద్ ఉన్ నబీ ఊరేగింపు
NEWS Aug 26,2026 09:54 pm
కరీంనగర్: కరీంనగర్‌లో మిలాద్ ఉన్ నబీ ఊరేగింపు ప్రశాంతంగా, వైభవంగా జరిగింది. సీపీ గౌష్ ఆలం బందోబస్తును స్వయంగా పర్యవేక్షించారు. నాఖా, తెలంగాణ చౌక్ వద్ద మత పెద్దలను శాలువాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. నగర గంగా-జమునా తెహజీబ్‌కు ఈ వేడుక నిదర్శనమని, సహకరించిన అందరికీ సీపీ ధన్యవాదాలు తెలిపారు.