ఆడబిడ్డ పెళ్లికి అండగా సర్ధార్ రవీందర్ సింగ్
NEWS Aug 26,2026 09:54 pm
కరీంనగర్: మాట తప్పని నాయకుడిగా మాజీ మేయర్ సర్ధార్ రవీందర్ సింగ్ తన నిబద్ధతను చాటుకున్నారు. 58వ డివిజన్‌కు చెందిన దుర్శెట్టి అనుశ్రీ–శ్రీనివాస చారి వివాహానికి హాజరై వధూవరులను ఆశీర్వదించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రూ.25 వేల ఆర్థిక సహాయంతో పాటు పట్టుచీరను కానుకగా అందజేశారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం ప్రజాప్రతినిధి బాధ్యతని ఆయన పేర్కొన్నారు.