కరీంనగర్‌లో ఘనంగా మిలాద్ ఉన్ నబీ
NEWS Aug 26,2026 05:58 pm
కరీంనగర్‌లో మిలాద్ ఉన్ నబీ వేడుకలను ముస్లింలు ఘనంగా నిర్వహించారు. బొంబాయి స్కూల్‌లో ఆసారే ముబారక్ దర్శనం అనంతరం ప్రారంభమైన శాంతి ర్యాలీ కరిముల్లాహ్ షా దర్గాహ్ వరకు కొనసాగింది. తెలంగాణ గంగా జమునా తెహజీబ్‌కు ప్రతీకని, మహమ్మద్ ప్రవక్త జీవితం మానవాళికి ఆదర్శమని ర్యాలీలో పాల్గొన్న మాజీ సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి పేర్కొన్నారు.