కాజీపేట నూతన బస్‌స్టాండ్‌కు భూమి మార్పిడి ప్రక్రియ వేగవంతం చేయాలి
NEWS Aug 25,2026 02:49 pm
కాజీపేట నూతన బస్‌స్టాండ్ నిర్మాణానికి అవసరమైన భూమి మార్పిడి ప్రక్రియను వేగవంతం చేయాలని వరంగల్ ఎంపీ కడియం కావ్య కోరారు. హైదరాబాద్‌లోని మంత్రి క్వార్టర్స్‌లో శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని ఎంపీ కావ్య కలిసి వినతిపత్రం అందజేశారు. కాజీపేట సిగ్నల్ జంక్షన్ వద్ద దక్షిణ మధ్య రైల్వేకు చెందిన భూమిని రాష్ట్ర ప్రభుత్వ భూమితో సమాన భూ విలువ ప్రాతిపదికన మార్పిడి చేసేందుకు రైల్వే ప్రతిపాదించిన విషయాన్ని మంత్రి దృష్టికి ఎంపీ తీసుకెళ్లారు.