బీర్పూర్‌లో స్కూల్ కాంప్లెక్స్ సమావేశం
NEWS Aug 25,2026 03:28 pm
బీర్పూర్: మండలంలోని తుంగూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో మంగళవారం స్కూల్ కాంప్లెక్స్ సమావేశం నిర్వహించారు. ఎంఈఓ ఎస్. నాగభూషణం TMF డైరీని ఆవిష్కరించారు. సమావేశానికి బీర్పూర్, ధర్మపురి, సారంగాపూర్ మండలాలకు చెందిన ఉపాధ్యాయులు హాజరయ్యారు. విద్యార్థుల అభ్యసన సామర్థ్యాల పెంపు, బోధనలో నూతన విధానాల అమలు, విద్యా ప్రమాణాల మెరుగుదలపై చర్చించారు. ఉపాధ్యాయులు తమ అనుభవాలను పంచుకుని విద్యార్థుల ప్రగతికి అనుగుణంగా సమర్థవంతమైన బోధనా పద్ధతులను అవలంబించాలని సూచించారు.