మతం మారాలని సాధిక్ ఒత్తిడి: SP
NEWS Aug 24,2026 08:37 pm
కాకినాడ ఏఈ నూకరాజు కుటుంబం సామూహిక ఆత్మహత్య కేసుపై జిల్లా ఎస్పీ బిందుమాధవ్ వివరాలు తెలిపారు. నూకరాజు, ఆయన భార్య మీనా, కుమార్తె సౌజన్య, మనవడు రియాన్స్ రెడ్డి గోదావరిలో దూకగా, చిన్నారి రియాన్స్ తప్ప మిగతా ముగ్గురు మృతి చెందారు. దొరికిన సూసైడ్ నోట్ల ఆధారంగా, మతం మారాలని సౌజన్యపై రైఫిల్ షూటింగ్ కోచ్ సాధిక్ ఖాన్ ఒత్తిడి తెచ్చి వేధింపులకు గురిచేసినట్లు తేలింది. నిందితుడిపై హత్య, బలవంతపు మతమార్పిడి కేసులు నమోదు చేశారు. పరారైన సాధిక్‌ను ఉత్తరప్రదేశ్ (మేరఠ్)లో పోలీసులు అరెస్టు చేశారు. న్యాయస్థానం అతడికి 14 రోజుల రిమాండ్ విధించగా, విచారణ నిమిత్తం కస్టడీకి కోరనున్నట్లు ఎస్పీ తెలిపారు.