SIR ప్రక్రియపై విస్తృత అవగాహన కల్పించాలి
NEWS Aug 24,2026 08:38 pm
SIR (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) కార్యక్రమంపై తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి. సుదర్శన్ రెడ్డి అన్ని జిల్లాల కలెక్టర్లు, జిల్లా ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. సమీకృత జిల్లా కలెక్టరేట్ (ఐడీఓసీ) నుంచి హనుమకొండ జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి చాహత్ బాజ్ పాయి ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి. సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ, ఆగస్టు 27న అన్ని పోలింగ్ కేంద్రాల పరిధిలో గ్రామ సభలు, వార్డు సభలు నిర్వహించాలని సూచించారు.