మిలాద్ ఉన్ నబీ బందోబస్తుపై డీఐజీ సమీక్ష
NEWS Aug 24,2026 03:10 pm
కరీంనగర్: మిలాద్ ఉన్ నబీ పండుగను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు పటిష్ట భద్రతా చర్యలు చేపట్టాలని జోన్-III డీఐజీ సన్ ప్రీత్ సింగ్ అధికారులను ఆదేశించారు. అన్ని జిల్లాల ఎస్పీలు, సీపీలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా ఉంచాలని, సోషల్ మీడియా వదంతులపై తక్షణ చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.