నేరగాళ్లకు 17 కేసుల్లో కఠిన శిక్షలు
NEWS Aug 21,2026 08:35 am
కరీంనగర్ జిల్లాలో నేరగాళ్లకు న్యాయస్థానాల ద్వారా కఠిన శిక్షలు పడేలా చేయడంలో పోలీస్ కోర్టు విభాగం విశేష సేవలు అందించింది. పకడ్బందీ సాక్ష్యాధారాల సమర్పణతో 17 ప్రధాన కేసుల్లో నిందితులకు జైలు శిక్షలు, జరిమానాలు పడ్డాయి. ఇందులో ముగ్గురు హంతకులకు యావజ్జీవ ఖైదు పడగా, మిగతా కేసుల్లోనూ భారీ శిక్షలు పడ్డాయి. ఈ సందర్భంగా కృషి చేసిన సిబ్బందిని పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం అభినందించారు.