ఖండివరంలో పశు వైద్య శిబిరం
NEWS Aug 19,2026 10:19 pm
చీడికాడ మండలం ఖండివరం గ్రామంలో విశాఖ డెయిరీ డైరెక్టర్ శీరంరెడ్డి సూర్యనారాయణ ఆర్థిక సహకారంతో పశు వైద్య శిబిరం నిర్వహించారు. సహాయ సంచాలకులు డా.వి.చిట్టినాయుడు శిబిరాన్ని ప్రారంభించి పశుగ్రాసం పెంపకం, థైలేరియా వ్యాక్సిన్, లింగ నిర్ధారిత వీర్యం ప్రాముఖ్యతను వివరించారు. 60 పశువులకు చికిత్స, 93 పశువులకు టీకాలు, 121 పశువులకు నట్టల నివారణ మందులు పంపిణీ చేశారు.