ఘన వ్యర్ధాల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలి
NEWS Aug 19,2026 09:48 pm
గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఘన వ్యర్ధాల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని హనుమకొండ జిల్లా కలెక్టర్, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రత్యేకాధికారి చాహత్ బాజ్ పాయి అన్నారు.క్యాంపు కార్యాలయం నుండి కలెక్టర్ మున్సిపల్ అధికారులతో సమావేశాన్ని జిల్లా కలెక్టర్ నిర్వహించారు.కార్పొరేషన్ పరిధిలో ఘన వ్యర్ధాల తడి, పొడి చెత్త వ్యర్థాల నిర్వహణకు చేపట్టాల్సిన చర్యలపై అధికారులు, సంస్థల ప్రతినిధులతో కలెక్టర్ సమీక్షించారు.