కార్మికుల బకాయి జీతాలు చెల్లించాలి
NEWS Aug 19,2026 02:07 pm
చోడవరం మండలంలో గ్రామపంచాయతీ పారిశుద్ధ్య కార్మికులు, ప్రభుత్వ పాఠశాలల శానిటేషన్ వర్కర్లకు బకాయి జీతాలు వెంటనే చెల్లించాలని సీఐటీయూ నాయకులు ఎస్సీ కమిషన్ డైరెక్టర్ వారాడ సీతారాంను కోరారు. పంచాయతీ కార్మికులకు ఆరు నెలల నుంచి ఏడాది వరకు, పాఠశాల శానిటేషన్ వర్కర్లకు ఐదు నెలలుగా జీతాలు అందలేదని తెలిపారు. సీఐటీయూ జిల్లా అధ్యక్షులు వీవీ శ్రీనివాసరావు, మండల నాయకులు ఎస్వీ నాయుడు, ఈర్లి చిరంజీవి తదితరులు వినతిపత్రం అందించారు.