కరీంనగర్ టౌన్ ప్లానింగ్ విభాగంలో ACB తనిఖీలు
NEWS Aug 18,2026 08:23 pm
కరీంనగర్ నగరపాలక సంస్థ టౌన్ ప్లానింగ్ విభాగంలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు ఆకస్మిక సోదాలు నిర్వహించారు. భవన నిర్మాణ అనుమతుల మంజూరులో ఆలస్యం, అక్రమాలు చోటుచేసుకుంటున్నాయనే ఫిర్యాదుల ఆధారంగా ఈ తనిఖీలు చేపట్టారు. అధికారులు సంబంధిత రికార్డులు, దస్త్రాలను క్షుణ్ణంగా పరిశీలిస్తూ అవినీతి ఆరోపణలపై విచారణ జరుపుతున్నారు.