రిజిస్ట్రేషన్ ఒకరి పేరున.. రికార్డుల్లో మరొకరి పేరు!
NEWS Aug 18,2026 08:25 pm
భీమిలి: పద్మనాభం మండలం కొరాడ గ్రామంలో భూమి రిజిస్ట్రేషన్ ఒకరి పేరున ఉండగా, రెవెన్యూ రికార్డుల్లో మరో వ్యక్తి పేరు నమోదు కావడం కలకలం రేపింది. అప్పలరాజు 2024లో 0.138 సెంట్ల భూమిని కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అయితే మ్యుటేషన్ సమయంలో సన్యాసమ్మ పేరు నమోదు చేసినట్లు ఆర్టీఐ సమాధానంలో అధికారులు పేర్కొన్నారు. అక్రమ మ్యుటేషన్ రద్దు చేసి తన పేరు పునరుద్ధరించాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని అప్పలరాజు ఆర్డీవో, కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు.