అనధికార ప్రెస్ స్టికర్లపై చర్యలు తీసుకోవాలి.
NEWS Aug 17,2026 09:53 pm
రాయికల్: వాహనాలపై అనధికారికంగా ప్రెస్ స్టికర్, గుర్తులు వినియోగిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ టీయూడబ్ల్యూజే–ఐజేయూ రాయికల్ ఆధ్వర్యంలో ప్రజావాణిలో వినతి పత్రం సమర్పించారు. ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో ఎంపీడీఓ చిరంజీవికి వినతిపత్రం అందించారు. మండల వ్యాప్తంగా అనేక పైవెట్ వాహనాలపై అనుమతులు లేకుండానే ప్రెస్ స్టికర్, గుర్తులు వేసుకుంటున్నారని, వాటిపై చర్యలు తీసుకోవాలని కోరారు.