ప్రజావాణిలో 41 వినతులు స్వీకరించిన కలెక్టర్
NEWS Aug 17,2026 07:30 pm
ప్రజావాణిలో వచ్చిన అర్జీలపై సమగ్ర విచారణ జరిపి త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణిలో ప్రజల నుంచి 41 ఫిర్యాదులు, వినతులు స్వీకరించారు. అర్జీలను పెండింగ్‌లో ఉంచకుండా సత్వరమే పరిష్కరించాలని సూచించారు. ఇకపై అన్ని ఫైళ్లను కలెక్టర్ కార్యాలయం ద్వారానే పంపించాలని జిల్లా అధికారులను ఆదేశించారు.