ప్రజావాణిలో మహితాపూర్ వార్డు సభ్యుల వినతి
NEWS Aug 17,2026 07:35 pm
రాయికల్ మండలం మహితాపూర్ గ్రామంలోని పలు వార్డుల్లో విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేసి సమస్యలు పరిష్కరించాలని, గన్నెగుట్ట శ్రీ కనకదుర్గమ్మ ఆలయం వద్ద భక్తుల కోసం బస్సులు ఆపాలని కోరుతూ వార్డు సభ్యులు ప్రజావాణిలో సోమవారం వినతిపత్రం అందజేశారు. నోడల్ అధికారి బింగి చిరంజీవికి వార్డు సభ్యులు అనుమల్ల రమ సత్యనారాయణ, బుస గంగా మల్లయ్య, భూపల్లి పరమేష్ వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమంలో గ్రామస్తులు తదితరులున్నారు.