విద్యార్థుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటం
NEWS Aug 17,2026 10:04 pm
తెలంగాణ ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతోందని విద్యార్థి సంఘాల నేతలు ఆరోపించారు. పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ పీడీఎస్‌యూ, డీఎస్‌ఏ, టీఎస్‌ఎఫ్ ఆధ్వర్యంలో హనుమకొండ కలెక్టరేట్‌ను ముట్టడించారు. నేతలు మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులకు సంబంధించిన బకాయిలను ప్రభుత్వం తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. సమస్యను పరిష్కరించకపోతే ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.