అదుపు తప్పిన బస్సు.. తప్పిన ప్రమాదం
NEWS Aug 17,2026 04:35 pm
పరకాల మండలం రాయపర్తి శివారులో రోడ్డు ప్రమాదం జరిగింది.పరకాల నుంచి హనుమకొండ వైపు వస్తున్న ఓ ఆర్టీసీ బస్సు గ్రామ శివారు వద్దకు రాగానే అదుపుతప్పి రోడ్డు పక్కకు ఓరిగిపోయింది.ప్రమాద సమయంలో బస్సులో సుమారు 40 మంది ప్రయాణికులు ఉన్నారు. అదృష్టవశాత్తు ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడ్డారు. ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.బస్సు రోడ్డు పక్కన మట్టిలో ఒరిగిపోవడంతో క్రేన్ సహాయంతో దానిని తీసేందుకు చర్యలు చేపట్టారు.