కపటిలో ఐదేళ్ల సమస్యకు పరిష్కారం
NEWS Aug 17,2026 07:52 pm
ఆదోని మండలం కపటి గ్రామ ప్రజలు స్మశానవాటికకు వెళ్లి తిరిగి వచ్చే సమయంలో కనీసం ముఖం కడుక్కోవడానికి కూడా నీటి సౌకర్యం లేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ సమస్యను గుర్తించిన బీజేపీ కార్యకర్తలు ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి దృష్టికి తీసుకెళ్లారు. ఎమ్మెల్యే సహకారంతో సమస్య పరిష్కారానికి పనులు చురుగ్గా సాగుతున్నాయి. పదవి ఉన్నప్పుడే ప్రజలకు సేవ చేయడం కాకుండా, ప్రజల సమస్యలను గుర్తించి పరిష్కారం కోసం ముందుకు రావడమే నిజమైన నాయకత్వమని పేర్కొన్నారు.