ప్రజావాణిలో తొలి ఫిర్యాదుదారుడు రాజమౌళి
NEWS Aug 17,2026 03:33 pm
రాయికల్: మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో తొలి ఫిర్యాదుదారుడిగా ఇంటర్నేషనల్ ఉమెన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు ఆడెపు రాజమౌళి హాజరయ్యారు. ఈ సందర్భంగా మండలంలోని మైతాపూర్, రామాజీపేట, ఇటిక్యాల గ్రామాలకు సంబంధించిన ప్రధాన రహదారుల సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. రహదారుల సమస్యలతో ప్రజలు, వాహనదారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరించి, సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని కోరారు.