గ్రూప్-1 లాంటి స్కామ్ ఎన్నడూ చూడలేదు
NEWS Aug 17,2026 03:03 pm
అసెంబ్లీ లాబీలో AP ముఖ్యమంత్రి చంద్రబాబు మీడియాతో చిట్‌చాట్‌గా మాట్లాడారు. తన 50 ఏళ్ల రాజకీయ జీవితంలో గ్రూప్ 1 లాంటి స్కామ్‌ను ఎన్నడూ చూడలేదన్నారు. ఎల్లుండి అన్ని వాస్తవాలను అసెంబ్లీలో పెడతామని తెలిపారు. ‘‘గొడ్డలి పార్టీ స్వార్ధానికి ఎందరో నిరుద్యోగులు బలయ్యారు. డీఎస్సీ అభ్యర్థులు ఆత్మాభిమానంతోనే రోడ్డెక్కారు. డీఎస్సీ నియామకాల్లో 50 శాతానికి పైగా మహిళలే ఉన్నారు. డీఎస్సీతో వారికి ఎంతో ఎమోషనల్ బాండింగ్ ఉంది. ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తుంటే వారు ఎలా సహించగలరు’’ అని సీఎం ప్రశ్నించారు.