ఘనంగా నాగుల పంచమి వేడుకలు
NEWS Aug 17,2026 03:32 pm
రాయికల్: పట్టణంలోని మార్కండేయ దేవాలయంలో నాగుల పంచమి వేడుకలను మహిళలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయానికి పెద్ద సంఖ్యలో చేరుకున్న మహిళలు నాగదేవతకు ప్రత్యేక పూజలు చేసి పాలు పోసి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. నాగుల పంచమి సందర్భంగా ఆలయ పరిసరాలు భక్తులతో సందడిగా మారాయి. మహిళలు సంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించి నాగదేవతను కొలిచారు.