దానయ్య కుటుంబానికి టీడీపీ రూ.5లక్షల సాయం
NEWS Aug 17,2026 02:32 pm
పలాసలో గొర్రెలకాపరి దానయ్య కుటుంబాన్ని పరామర్శించారు టీడీపీ నేతలు. కష్టాల్లో ఉన్న దానయ్య కుటంబానికి టీడీపీ తరఫున రూ.5 లక్షలు సాయం చేశారు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్, టీడీపీ నేత కర్త వెంకన్న చౌదరి. వైసీపీ నేత, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుమారుడు ఆరవ్ నడిపిన బైక్ ఢీకొని మృతి చెందాడు గొర్రెల కాపరి దానయ్య. దీంతో ఆ కుటుంబం రోడ్డున పడింది. కుటుంబాన్ని పరామర్శించిన టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు పార్టీ తరఫున, ప్రభుత్వ తరఫున అన్ని విధాలుగా సాయం అందిస్తామన్నారు.