సీఎం సోరెన్‌కు రాహుల్ గాంధీ లేఖ
NEWS Aug 17,2026 02:23 pm
ఝార్ఖండ్‌లో ప్రభుత్వ ఉద్యోగ నియామక పరీక్షల్లో అవకతవకలపై విద్యార్థుల ఆందోళన కొనసాగుతున్న వేళ కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ స్పందించారు. ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌కు సోమవారం లేఖ రాశారు. ఆందోళన చేస్తున్న విద్యార్థుల ప్రతినిధులతో సీఎం స్వయంగా సమావేశం కావాలని కోరారు. సమస్య పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.